కాల్వల్లో జమ్ము తొలగించాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:35 PM
మ హాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎం జీకేఎల్‌ఐ) కాల్వల్లో పెరిగిన జమ్మును తొలగిం చి రైతులకు సాగునీరందించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- రైతులతో కలిసి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
పెద్దకొత్తపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : మ హాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎం జీకేఎల్‌ఐ) కాల్వల్లో పెరిగిన జమ్మును తొలగిం చి రైతులకు సాగునీరందించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని డీ-1 కాలువల దుస్థితిని రైతులతో కలిసి ఆయన పరి శీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సా గునీరు అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ముందు చూపుతో ఎండా కాలంలోనే జమ్ము తొలగించి ఉంటే రైతులకు మేలు జరిగేదని, కానీ ప్రభుత్వం పట్టించుకో లేదని అన్నారు. కాల్వల మరమ్మతులు కూడా చేయకుండా ఈ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని దుయ్యబట్టారు. మండలంలోని దేవుని తిర్మ లాపూర్ గ్రామం శివారు లోని కేఎల్‌ఐ డీ-1 కాల్వలను పరిశీలించి బాచారం, పస్పు ల గ్రామాల రైతులకు సాగు నీరందేలా చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్ చే శారు. కాల్వల మరమ్మతు చే యకుంటే రైతులను సమీకరిం చి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చ రించారు. ఆయన వెంట సర్పంచ్‌లు కర్ణాకర్ రెడ్డి, వంశీకాకం రమేశ్, బీఆర్‌ఎస్ నాయకులు కట్ట రాజేందర్ గౌడ్, రవినాయక్, శ్రీనివాస్‌రెడ్డి, బెట్టరి నాగరాజు, రమేష్‌రెడ్డి, విష్ణువర్ధన్ యా దవ్, పిల్లి శేఖర్, శ్రీకృష్ణచారి, తిప్పరాజు, మల్లేష్, బండి రవి, మాజీ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.