Share News

‘మండే’ సూర్యుడు..

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:00 PM

సూర్య ప్రతాపం కారణంగా వారం పది రోజు లుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. విప రీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. ఎండలు రోజు రోజుకు మండిపో తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

‘మండే’ సూర్యుడు..

రోజురోజుకూ ముదురుతున్న ఎండలు

-44 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలు

-మధ్యాహ్నం సమయంలో ఎండ ప్రభావం తీవ్రతరం

-ఉదయం పది గంటల నుంచే వేడెక్కుతున్న వాతావరణం

-రాబోయే రోజుల్లో మరింత ఉధృతం

మంచిర్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): సూర్య ప్రతాపం కారణంగా వారం పది రోజు లుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. విప రీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. ఎండలు రోజు రోజుకు మండిపో తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూ ర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో మ ధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమి తం కావలసి వస్తోంది. సాధారణంగా మే నెల లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందుకు భిన్నంగా ఏప్రిల్‌లోనే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. జిల్లాలో క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావడా నికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచా రం పూర్తిగా తగ్గుముఖం పడుతోంది.

అడుగంటుతున్న భూగర్భ జలాలు...

ఎండలు తీవ్రతరం కావడంతో భూగర్భజ లాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ కార ణంగా గోదావరి నదిలో పూర్తిగా నీరు అడు గంటి పోగా బోర్లలో సైతం లోతుల్లోకి వెళ్లా యి. గోదావరిలో నీరు అడుగంటి పోతుండ టంతో దాని ప్రభావం నది పరివాహక ప్రాం తాల్లోని బోర్లపైన పడుతోంది. ఎండల ప్రభా వం వ్యవసాయ రంగంపైనా పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హా జీపూర్‌ మండలాల్లో సుమారు 3వేల ఎకరా లకు యాసంగికి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందుతోంది. అయితే లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో కొంతమేర మాత్రమే గూడెం ఎత్తిపోతల నీరు అందుతుండగా, మి గితా ప్రాంతాల్లో రైతులు బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తారు. ముఖ్యంగా గోదావరి పరివా హక ప్రాంతాల రైతులు నదిలో మోటార్లు ఏర్పాటు చేసుకొని పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం నది ఎండి పోతుండటంతో ఆ ప్రభావం యాసంగి సాగుపైన చూపనుంది.

సింగరేణి పనివేళల్లో మార్పు తప్పనిసరి...

జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లం పల్లి సింగరేణి ఏరియాలలోని ఓపెన్‌ కాస్టు, అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లలో విధులు నిర్వహించే కార్మికులు పెరిగిన ఎండల కారణంగా ఇబ్బం దులు పడే అవకాశాలు ఉండటంతో పనివేళ ల్లో మార్పులు చేయడం తప్పనిసరిగా మారిం ది. ముఖ్యంగా మిడిల్‌ షిఫ్ట్‌, ఉదయం షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్‌ షిఫ్ట్‌ వెళ్లే కార్మికులు మ ధ్యాహ్నం రెండు గంటలకు విధులు ముగిం చుకొని ఇంటికి రావాల్సి ఉండగా, మిడిల్‌ షిఫ్ట్‌ వెళ్లేవారు మధ్యాహ్నం ఒంటి గంటకు బయ లు దేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విధుల కు హాజరయ్యే వారు, విధుల నుంచి తిరిగి వ చ్చే వారు ఎండ తీవ్రతకు గురయ్యే అవకాశా లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు గనుల్లో హాజరు శాతం తగ్గకపోయినా రాబోయే రోజుల్లో ఎండ లు తీవ్రతరం కానుండగా, హాజరు శాతంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండల వేడిమి కారణంగా విధులు నిర్వహిం చేందుకు కార్మికులు ఆసక్తి చూపడంలేదు. కా ర్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉన్నతాధికారులు షిఫ్ట్‌ల వేళల్లో మార్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి...

క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఉక్కపో త కూడా అధికంగా ఉంటోంది. అలాగే ఇండ్ల లోనూ ఉక్కపోతలు ప్రారంభమవుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లలో ఇప్పటి నుంచే వేడి గాలు లు వస్తున్నాయి. కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు ఎండవేడిమి భరించలే కపోతు న్నారు. రోడ్లపక్కన గొడుగులు ఏర్పాటు చేస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. వి పరీతమైన వేడిమి కారణంగా ప్రజలు తాగు నీటి కోసం తహతహలాడుతున్నారు. పగటి పూట వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు రోడ్ల పక్కన ఉండే సోడా, జ్యూస్‌ సెం టర్ల వద్ద సేద తీరుతున్నారు.

జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా...

గడిచిన ఆరు రోజుల్లో జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 22న దండేపల్లి మండలం వెల్గనూరులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 23న కాసిపేట మండలం కొండాపూ ర్‌లో 44.2, 24న దండేపల్లి మండలం వెల్గనూ రులో 43.7, 25న కాసిపేట మండలం కొండా పూర్‌లో 44.3, 26న కన్నెపల్లి మండలం జన్కా పూర్‌లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. తాజాగా సోమవారం భీమారం మండలంలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా, నస్పూర్‌లో 45.4, కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో 45.3, దండేపల్లి మండలం వెల్గనూర్‌లో 45.2, దండేపల్లి మం డలం లింగాపూర్‌లో 45, లక్షెట్టిపేట మండ లం శాంతాపూర్‌లో 44.8, జైపూర్‌ మండలం కుందారంలో 44.6, పాత మంచిర్యాలలో 44.5, జన్నారంలో 44.4, చెన్నూర్‌ మండలం కొమ్మెరలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 27 , 2026 | 11:00 PM