Share News

kumaram bheem asifabad-అన్నదాతపై సాగు భారం

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:42 PM

అన్నదాత లకు ఏటా పెట్టుబడి భారంగా మారుతోంది. సీజన్‌ ప్రారంభంలో దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చి మార్కెట్‌లో విక్రయించేదాక రైతులు పెట్టుబ డులు పెట్టాల్సిందే. వ్యవసాయమే ప్రధాన జీవనధా రమైన జిల్లాలో పంటలపై రోజు రోజుకు సాగు భారం ఎక్కువవుతున్నది. ఏటా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వానకాలం పంటల సాగుకు చేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.

kumaram bheem asifabad-అన్నదాతపై సాగు భారం
లోగో

- జిల్లాలో మొదలైన వేసవి దుక్కులు

- ట్రాక్టర్లు, నాగళ్ల కిరాయి పెంపు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): అన్నదాత లకు ఏటా పెట్టుబడి భారంగా మారుతోంది. సీజన్‌ ప్రారంభంలో దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చి మార్కెట్‌లో విక్రయించేదాక రైతులు పెట్టుబ డులు పెట్టాల్సిందే. వ్యవసాయమే ప్రధాన జీవనధా రమైన జిల్లాలో పంటలపై రోజు రోజుకు సాగు భారం ఎక్కువవుతున్నది. ఏటా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వానకాలం పంటల సాగుకు చేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వేసవి దుక్కులపనులు జోరుగా సాగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరితంగా పెరిగి పోవడంతో పేద రైతుపై సాగు భారం మరింత పడుతోంది. కాడెద్దులు కనుమరుగై పోవడంతో ఆధునిక సాగు పద్ధతులతో పంటల సాగు చేపడుతున్నారు. గతంలో కాడెద్దులతోనే రైతు సాగు పనులు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థి తులు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అందు బాటులో ఉన్న ట్రాక్టర్‌యంత్రల సహాయంతోనే సాగు పనులు చేపడుతున్నారు. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10ట్రాక్టర్‌లు కనిపిస్తున్నాయి. దీంతో ఇంధన డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. పరిగిపోయిన ఇంధన ధరలతో పంటల సాగు చేయ డం కష్టమవు తోందన్న అభిప్రా యలు వక్తమవుతున్నాయి. ఏటేటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నా.. దానికి అనుగు ణంగా మద్దతు ధరలు పెరుగకపోవడంతో అన్నదా తలు ఆందోళనకు గురవుతున్నారు.

మండుతున్న ఇంధన రేట్లు..

జిల్లాలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108. 82 ఉండగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.97.09 లుగా ఉంది. ప్రస్తుతం వేసవి దుక్కుల పనులు ఊపందు కోవడంతో గ్రామాల్లో ట్రాక్టర్‌లు కూడాబిజీగా మారిపోయాయి. ఇక పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌, పె ట్రోల్‌ అమ్మకాలు కూడా ఎక్కువగానే కనిపిసున్నా యి. సీజన్‌ మొదలైన ఇందన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులకు మరింత భారంగా మారింది. జిల్లాలో రైతులు వేసవి దుక్కులు చేప డుతూ పంట చేలను చదును చేసుకుంటున్నారు. ఎండలు ముదిరిపోవడం, ఈ సమయంలోనే వేసవి దుక్కులు చేపడితే మంచి ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు.

- పెరుగుతున్న అద్దె ధరలు..

ఇందన ధరలకు అనుగుణంగానే ట్రాక్టర్‌ యజ మానులు అద్దె ధరలు పెంచేయడంతో అన్నదాత లపై అదనంగా భారం పడుతోంది. ఏటా గంటకు రూ.100 నుంచి రూ.200 వరకు అద్దెలను పెంచే స్తున్నారు. ఎందుకంటే డీజిల్‌ ధరలు పెరుగడంతో తమకేమి గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్‌ యజ మానులు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా రైతులు సాగు పను ల్లో యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతీ పనిని యంత్రాల సహాయంతోనే చేపడు తున్నారు. ప్రస్తుతం యంత్రాలతో వేసవి దుక్కులు దున్నడం, పంట చేలను చదును చేయడం, చెరు వులు, కుంటల నుంచి నల్ల మట్టి, సేంద్రియ ఎరువు లను తరలించడం, పత్తి కర్రలను తొలగించడం లాంటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కానీ ఇంధన ధరలు పెరిగాయన్న సాకుతో ట్రాక్టర్‌ యజమానులు అద్దెలను అమాంతంగా పెంచే స్తున్నారు. గత్యంతరం లేక రైతులు పనులు చేయిం చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

- 4,50,000 ఎకరాల్లో సాగు..

జిల్లాలో మొత్తం 1,19,978 మంది రైతులు ఉం డగా 4,50,000 ఎకరాలలో ఏటా వివిధ పంటలను సాగు చేస్తున్నారు. దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగి పోతున్నాయి. నాలుగైదు సంవత్సరల క్రితం వరకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయ్యేది. కాని ప్రస్తుతం రూ.20వేల నుంచి రూ.30వేల వరకుపెట్టుబడి వ్యయం అవుతుందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కూలీల కొర తతో యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగిపో తోందంటున్నారు. దీంతో పంటల సాగుకు పెట్టుబ డులు పెరిగిపోతున్నాయి.

సాగు పనుల ధరలు పెరిగాయి..

- సంతోష్‌, రైతు, ఆసిఫాబాద్‌.

పంటల సాగు పనుల ధరలు రోజురోజుకు విప రీతంగా పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలతో పాటు ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం పెరు గుతోంది. నాలుగేళ్ల క్రితం వరకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు పెట్టాల్సి వస్తోంది.

Updated Date - Apr 08 , 2026 | 10:42 PM