Share News

kumaram bheem asifabad- వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:04 PM

పెంచికల్‌పేట, దహెగాం మండలాల మధ్య పెద్దవాగుపై రూ.18 కోట్లతో సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో నిర్మిస్తున్న వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. బుధవారం ఈ పనులు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తే రెండు మండలాలకు అనుంసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.

kumaram bheem asifabad-  వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలి
: పెద్దవాగు వంతెన పనులను పరిశీలిస్తున్న ఎంపీ నగేష్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు

దహెగాం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పెంచికల్‌పేట, దహెగాం మండలాల మధ్య పెద్దవాగుపై రూ.18 కోట్లతో సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో నిర్మిస్తున్న వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. బుధవారం ఈ పనులు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తే రెండు మండలాలకు అనుంసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు మాట్లాడుతూ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేస్తే గ్రామీణ వ్యవస్థ మెరుగు పడుతుందన్నారు. రెండు మండలాల వాసుల కల కూడా తీరనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మహిళ మోర్చా అధ్యక్షురాలు నారా వనజ, కొప్పుల శంకర్‌, కొండ్ర ప్రభాకర్‌ గౌడ్‌, ఘనపురం నగేష్‌, మనోహర్‌ గౌడ్‌, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ గోడం నగేష్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ ాబు ప్రారంభించారు. అనంతరం ఎల్కపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన యువకుడిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. అలాగే పోతపల్లి గ్రామాలకు పోడు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పాల్వాయి సుధాకర్‌రావు, తహసీల్దార్‌ రవీందర్‌, సర్పంచ్‌లు రాంచందర్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, ఉమాదేవి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు రాజన్న, చంద్రమౌళి, కృష్ణ, నాగన్న, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్నూరు కాపు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టేందుకు స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌కు బుధవారం వినతి పత్రం అందించారు. సిర్పూర్‌ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నాయకులు మర్యాద పూర్వకంగా ఎంపిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గజ్జల లక్ష్మణ్‌ మాట్లాడుతూ సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఒక్కో చోట 20 గుంటల స్థలం, నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి మిట్ట దేవేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇందూరి తిరుపతి, కౌన్సిలర్‌ గజ్జల లావణ్య, కొత్మీర్‌ సర్పంచ్‌ సత్యనారాయణ, సంఘం ప్రతినిధులు అంగాల తిరుపతి, పెంటన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 11:04 PM