కన్నులపండువగా సత్యదేవుడి కల్యాణం
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:30 PM
భక్తుల గోవింద నామస్మరణ మధ్య గూడెంగుట్ట శ్రీసత్యనారాయణస్వామి రమా సమేతుడయ్యాడు. దీంతో వేలాది మంది భక్తులు తన్మయత్వంతో ఆలయ పరిసర ప్రాం తమంత గోవిందనామస్మరణతో మార్మోగాయి.
తరలివచ్చిన భక్తజనం - గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం
దండేపల్లి జనవరి 30 (ఆంధ్రజ్యోతి): భక్తుల గోవింద నామస్మరణ మధ్య గూడెంగుట్ట శ్రీసత్యనారాయణస్వామి రమా సమేతుడయ్యాడు. దీంతో వేలాది మంది భక్తులు తన్మయత్వంతో ఆలయ పరిసర ప్రాం తమంత గోవిందనామస్మరణతో మార్మోగాయి. గూడెం శ్రీసత్యనారాయ ణస్వామి పుణ్యక్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం రాత్రి గోధూళి సముహూర్తాన సత్యదేవుడి కల్యాణం వేదమంత్రో చ్ఛారణల మధ్య కొనసాగింది. ముందుగా గుట్ట కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహం, రకరకాల పుష్పాలతో సన్నాయి వాయిద్యాలతో ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేశారు. ఆలయ ముఖ్య అర్చకులు రఘస్వామి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, భక్తు లు స్వామి వారికి పట్టువస్త్రాలు మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రధానాలయంలో స్వామి వారికి పుష్పాలంకరణ చేసిన అనంతరం క ల్యాణ వేదిక వరకు తీసుకవచ్చి విగ్రహమూర్తులను ప్రతిప్ఠించారు. అ నంతరం వేదపండితుల అభిరామచార్యులు, దుద్దిళ్ల నారాయణశర్మ, భ రత్‌శర్మల మంత్రోచ్ఛరణ నడుమ ఆలయ ముఖ్య అర్చకులు గోవ ర్ధనరఘస్వామి, అర్చకులు సంపత్‌స్వామి, ఆలయ అర్చకుల సమక్షంలో స్వామి వారికి కల్యాణ తంతును చూడముచ్చట నిర్వహించారు. వేలా ది మంది భక్తులు కుటుంబ సమేతంగా సత్యదేవుడి కల్యాణం తిలకిం చారు. ఈ వేడుకల్లో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వేలాది మంది భక్తులు తరలివచ్చి కల్యాణం తిలకించారు. కల్యాణం అనంతరం గుట్ట క్రింద పలు సాంస్కృతిక కార్య క్రమాలు భక్తులు తిలకించారు. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తైసోనోద్దీన్, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, ఆ లయ వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బం ది తగిన ఏర్పాటు చేసి వారు పర్యవేక్షించారు.