Share News

kumaram bheem asifabad-మేలైన విత్తనం.. పంటకు ప్రాణం

ABN , Publish Date - May 26 , 2026 | 10:24 PM

వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. పంట సాగు కోసం రైతుల పంట పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ముందస్తుగానే వచ్చేలా కనిపిస్తుం డడంతో రైతులు వానాకాలం సీజన్‌కు ముందుగానే పంట పొలాలలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటు న్నారు. అకాల వర్షాల కారణంగా భూమిలో పదను ఉండడంతో దుక్కలు చేస్తున్నారు.

kumaram bheem asifabad-మేలైన విత్తనం.. పంటకు ప్రాణం
లోగో

- పంట చేతికొచ్చే వరకూ బిల్లు భద్రం

- భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి

వాంకిడి, మే 26 (ఆంధ్రజ్యోతి): వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. పంట సాగు కోసం రైతుల పంట పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ముందస్తుగానే వచ్చేలా కనిపిస్తుం డడంతో రైతులు వానాకాలం సీజన్‌కు ముందుగానే పంట పొలాలలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటు న్నారు. అకాల వర్షాల కారణంగా భూమిలో పదను ఉండడంతో దుక్కలు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ జూన్‌ మొదటి వారంలో మొదలవుతుంది. కానీ ఇప్పటి నుంచే రైతులు పత్తి విత్తనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. రైతులు ఎరువుల దుకాణాల్లో ఇప్పటి నుంచే పత్తి విత్తనాలు కొనుగోలు చేసుకుంటు న్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తన ఎంపికలో పలు జాగ్రత్త లు తీసుకోవాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తు న్నారు. ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా పంట దిగుబడి, పంట కాలం వృఽథా అయ్యే ప్రమాదం ఉంటుంది.

- కమీషన్లకు కక్కుర్తిపడి..

పల్లెల్లో అనధికారికంగా విత్తనాలు అమ్మే వారు కమీషన్లకోసం కక్కుర్తిపడి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే వారున్నారు. మూడేళ్లుగా కుమ రం భీం జిల్లాలో చాలా వరకు నాసిరకం పత్తి విత్తనాల కారణంగా నష్టపోతున్నారు. గత కొంత కాలం నుంచి నకిలీ పత్తి విత్తనాలు వేసి కొందరు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. పలువురు వ్యాపారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తనాలు అంటగడుతుండడంతో పంటల దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నా యి. జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు నకిలీ పత్తి విత్తనాలను ఇళ్లవద్దకు తీసుకువెళ్లి రైతులను మాయమాటలు చెబుతూ నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్నారు. వ్యవసాయ అధికా రుల సూచనలు, సలహాలు తీసుకోకపోవడం, పత్తి విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల రైతులు పంటల దిగుబడులు రాక చేసిన అప్పులు తీరలేక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. మద్యదశారులు ఇచ్చిన విత్తనాలను కొనుగోలు చేయకుండా ఎరువుల దుకాణాల్లో విత్తుకొన్న ప్రతి రైతు కచ్చితంగా రసీదు, క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయడం అలవాటు చేసుకోవాలని అధికారు లు సూచిస్తున్నారు. భూమిలో తేమ శాతం సరిపడా ఉంటేనే విత్తనాలు పెట్టుకోవాలని వ్యవసాయాధి కారులు చెబుతున్నారు.

- శ్రమతో పాటు..

నకిలీ విత్తనాలతో రైతులు శ్రమతో పాటు ఎకరా కు రూ. 10-20వేల వరకు నష్టపోతున్నారు. నిర్ణీత పరిమాణం కంటే మొలకెత్తే శాతం(జెనెటిక్‌ ప్యూరి టీ) తగ్గితే నకిలీవిగా పరిగణిస్తారు. ప్రభుత్వంతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు విత్తనోత్పత్తి చేపడు తున్నాయి. పదుల సంఖ్యలో వంగడాలు మార్కెట్‌ లోకి వస్తుండగా విక్రయాలపై పర్యవేక్షణ కొరవడు తోంది. నిబంధనల మేరకు గింజ నాణ్యత 98-99 శాతం, మొలకేత్తే గుణం 65-90 శాతం ఉండాలి. పత్తి విత్తనాలకు జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ (జీఈఎస్‌సీ) ఽధ్రువీకరణ ఉండాలి. ప్యాకెట్‌ లేబుల్‌పై నిర్ధేశిత ప్రాంతానికి సరిపోతుందా ?లేదా ? అనే విషయం ముంద్రించాలి. నాణ్యత, మొలక, తేమ, శాతం, పత్తికి బీటీ ప్రొటిన్‌ శాతంపెర్కొనాలి. ల్యాబ్‌ నంబరు ఉండాలి. ఇవేమీ లేకుండానే కొన్ని కంపేనీలు రంగుల కవర్లలో ఇష్టానుసారంగా వివరాలు ముద్రిస్తూ మార్కెట్లోకి తెస్తున్నాయి. గతేడాది వాంకిడి మండలానికి చెందిన రైతు పత్తి సాగు చేశాడు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పత్తి ఏపుగా పెరిగినా కాయరా లేదు. దీంతో రెండెకరాల్లో రూ. 3 లక్షల వరకు నష్టపోయారు. మండలానికి చెందిన రైతుకు మా య మాటలు చెప్పి అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి పత్తి విత్తనాలను అంటగ ట్టారు. కంపెని విత్తనమంటు కొనుగోలు చేసి నాటారు. తీరా చూస్తే దిగుబడి రాలేదు. కొనుగోలు సమయంలో రశీదు తీసుకోకపోవడంతో నష్టపోయారు.

ఇలా చేయాలి..

- లైసెన్స్‌ ఉన్న అధికృత దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

- విత్తన ప్యాకెట్లపై లాట్‌ నంబర్‌, ప్యాకింగ్‌ తేదీ, టేబుల్‌ తదితరాలను పరిశీలించాలి.

- విత్తన మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి.

- కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి.

-విత్తన ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దానికి మొబైల్‌తో స్కాన్‌ చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

- నాటే కంటే ముందే కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం పరీక్షించుకోవాలి.

- విత్తన సంచులు, రసీదులను భద్రపరుచుకోవాలి.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు..

- మిలింద్‌, ఆసిఫాబాద్‌ ఏడీఏ

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఎవరైనా పత్తి విక్రయిం చేందుకు వస్తే రైతులు తీసుకోవద్దు. రైతులు తప్పనిసరిగా ఎరువుల దుకాణంలో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి. విత్తన ప్యాకె ట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే విత్తనాలకు సంబంధించి పూర్తి సమాచారం వస్తుంది. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గమనిస్తే సమా చారం అందించాలి. రైతులు పత్తి విత్తనాల ఎంపిక లో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.

Updated Date - May 26 , 2026 | 10:34 PM