Share News

kumaram bheem asifabad- జోరుగా బెల్టు దందా..

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:21 PM

జిల్లాలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో బెల్టు దుకాణాలు నిర్వహించే వారు 24 గంటల పాటు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు ముందస్తు సమాచారంతో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా మూడు పూవులు ఆరు కాయలు అన్నచందంలా మారింది.

kumaram bheem asifabad- జోరుగా బెల్టు దందా..
లోగో

- లైసెన్స్‌ దుకాణాల నుంచి గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా

- నిబంధనలకు విరుద్ధంగా 24 గంటల పాటు విక్రయాలు

చింతలమానేపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో బెల్టు దుకాణాలు నిర్వహించే వారు 24 గంటల పాటు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు ముందస్తు సమాచారంతో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా మూడు పూవులు ఆరు కాయలు అన్నచందంలా మారింది. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులను నియంత్రిస్తామని చెప్పినా ఇప్పటి వరకు వీటికి అడ్డుకట్ట వేయడం లేదని చెబుతున్నారు.

- రెచ్చిపోతున్న వ్యాపారులు..

లైసెన్స్‌ పొందిన మద్యం వ్యాపారులు ఇష్టారీతిన విక్రయాలు చెపడుతున్నారు. వారికి కేటాయించిన దుకాణాల ద్వారా జిల్లా వ్యాప్తంగా బెల్లు షాపులు నిర్వహించుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహించే నిర్వాహకులు నేరుగా వైన్స్‌ల నుంచే పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై ఇతర మార్గాల ద్వారా సరఫరా చేసుకుంటున్నారు. ఓ వైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే మరో వైపు బెల్టు దుకాణాలు పల్లె. పట్టణ ప్రజలను మత్తులో ముంచెత్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు సాగుతు న్నా.. అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. జిల్లాలోని కొందరు మద్యం దుకాణ యజమానులు కమిషన్లకు బెల్టు దుకాణాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ మరి కొందరు మాత్రం బెల్లు షాపులను ప్రోత్సహిస్తూ బెల్టు దందా చేసేవారికి మద్యాన్ని వాళ్ల ఒప్పందం మేరకు సరఫరా చేస్తూ విపరీతంగా మద్యం అమ్మేలా ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. 24 గంటల పాటు మద్యం బెల్లు షాపుల్లో అందుబాటులో ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

- ఒక్కో గ్రామంలో పది వరకు..

ఒక్కో గ్రామంలో సుమారుగా పది షాపుల వరకు ఉంటాయి. ఇందులో రోజుకు ఒక్కో షాపులో సుమారుగా రూ. 5వేల నుంచి 10వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే 10 షాపులకు రూ. 50వేల నుంచి లక్ష వరకు ఒక్కో గ్రామంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో గ్రామంలోనే రోజుకు రూ. లక్ష వరకు మద్యం అమ్మకాలు జరిగితే జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో 33 వైన్స్‌ షాపులు, 3 రెస్టారెంట్‌ బార్లున్నాయి. 335 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 300 వరకు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యిపైనే బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యం బాటిళ్లను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించి సొమ్మ చేసుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 30 నుంచి 50 వరకు అధికంగా తీసుకుంటున్నారు. బీర్ల సీసాలపై సైతం ఒక్కో బాటి ల్‌పై రూ. 40 వరకు అదనంగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్టు దందా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:21 PM