Share News

kumaram bheem asifabad- కర్జెల్లి అడవి అందాల లోగిలి

ABN , Publish Date - May 17 , 2026 | 10:09 PM

ప్రకృతిలో అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, గలగలా పారే వాగులు, పక్షుల సందడి, రకరకాల వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పారుతున్న ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు ఈ అడవుల అందాన్ని మరింత పెంచుతున్నాయి.

kumaram bheem asifabad- కర్జెల్లి అడవి అందాల లోగిలి
లోగో

- ట్రాప్‌ కెమెరాలకు చిక్కుతున్న అడవి జంతువుల కదలికలు

- వేసవిలో దాహార్తి తీర్చేలా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు

ప్రకృతిలో అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, గలగలా పారే వాగులు, పక్షుల సందడి, రకరకాల వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పారుతున్న ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు ఈ అడవుల అందాన్ని మరింత పెంచుతున్నాయి.

చింతలమానేపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు అడవులను కాపాడడంలో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాల నిస్తున్నాయి. చింతలమానేపల్లి మండలంలోని కర్జెల్లి అటవీ క్షేత్రం సహజ సంపదతో నిండిన జీవ ప్రపంచాన్ని మరోసారి కళ్లకు కట్టినట్టుగా చూపించింది. అటవీ శాఖ అధికా రులు వ్యూహాత్మకంగా అమర్చిన కెమెరా ట్రాప్‌లలో పలు రకాల వన్యప్రాణులు స్పష్టంగా బందించబడడం అటవీ జీవ వైవిద్య సమృద్ధికి ప్రతీకగా నిలిచింది. అర్ధరాత్రి నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ గుంపులుగా సంచరించిన జింకలు, అడవి లోతుల్లో నిశితంగా సంచరించిన ఎలుగుబంటి, ముళ్లను విప్పి అప్రమత్తంగా కదిలిన ముళ్ల పంది, చురుకైన అడుగులతో తిరిగిన నక్కలు, ఠీవీగా నడుస్తున్న నీలుగాయి, తదితర మాంసాహార జంతువుల కదలికలు కెమెరా కళ్లల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ దృష్యాల కేవలం జంతువుల సంచారాన్ని మాత్రమే కాకుండా అ అటవీ ప్రాంతంలో ఆహార గొలుసు సమ తుల్యత, సహజ వాతావరణ స్థిరత్వం, జీవ వ్యవస్థ సుస్థిరతను కూడా ప్రతిబింభిస్తు న్నాయి. మా నవ జోక్యం తక్కువగా ఉండడం ఈ అడవుల పరిసరాల్లో వన్య ప్రాణులు నిర్భయంగా సంచరిస్తుండడం, అటవీశాఖ చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా భావిస్తున్నారు. ఈ కెమెరా ట్రాప్‌ల ద్వారా అక్రమ వేటగాళ్ల కదలికలను సులభంగా గుర్తించి అటవీ జంతువులను మరింత సమర్థంగా కాపాడే అవకాశం లభిస్తున్నది. కెమెరా ట్రాప్‌ల ద్వారా లభించిన ఈ ఆధారాలు కర్జెల్లి అటవీ క్షేత్రం వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో మరింత సమగ్ర సంరక్షణ చర్యలకు దారి చూపిస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యం, అటవీ శాఖ కృషి కలిసి వస్తే ఈ అటవీ క్షేత్రం వన్యప్రాణుల కోసం సురక్షిత ఆశ్రయంగా మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

- పచ్చిక బయళ్లు ఏర్పాటు..

అక్కడక్కడా పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి నీటి కుంటలు ఏర్పాటు చేసి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో వన్యప్రాణులు కోసం అడవిలో సోప్‌కిట్స్‌, సాసర్‌ఫీట్స్‌ ఏర్పాటు చేసి ముమ్మర చర్యలు చేపట్టారు. అలాగే వేసవి కాలంలో చెట్లు, వన్యప్రాణులు అగ్ని ప్రమాద భారిన పడకుండా ఫైర్‌లైన్‌ ఏర్పాటుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణపై అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా కర్జెల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో నెమళ్లు, కృష్ణజింకలు, చుక్కల దుప్పులు, ఎలు గుబంట్లు, కుందేళ్లు, నక్కలు, తోడేళ్లు, నీలుగాయి, వానర జాతికి సంబంధించిన ప్రాణులతో పాటు ఇతర జంతువులు సైతం అడవుల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటల వద్ద సందడి చేస్తూ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కుతున్నాయి. అడవిలో రోడ్డు మార్గం గుండా వెళ్లే ప్రయాణికులకు వన్యప్రాణుల సందడి కన్పిస్తుంది. ఈ ప్రాంతంలో పారుతున్న ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు ఈ అడవుల అందాన్ని మరింత పెంచాయి.

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..

- సుభాష్‌, ఎఫ్‌ఆర్వో (కర్జెల్లి)

ప్రస్తుత ఎండాకాలంలో కర్జెల్లి రేంజ్‌ పరిధిలో ఉన్న వన్యప్రాణులు, అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు తెచ్చినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం. వన్య ప్రాణుల సంరక్షణ కోసం గ్రామాల్లో అహ గాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. దీంతో పాటు అడవుల్లో అగ్గి రగిల్చకుండా ప్రజలు సహకరించాలి.

Updated Date - May 17 , 2026 | 10:09 PM