Share News

kumaram bheem asifabad- అడవికే అందం...సిద్దేశ్వర గుహలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:08 PM

: చుట్టు దట్టమైన అటవీ ప్రాంతం ఎతైన గుట్టలు, దారి పొడవున ఏపుగా పెరిగిన పెద్ద చెట్లు, పక్షుల కిలకిలరావాలు, అన్ని కాలాలు నీరందించే నీటి గుండాలు, భీముడి పాదముద్రలు సిద్దయ్య దేవుడి సొరంగ మార్గం, అందమైన ప్రకృతి ఆహ్లాదకర వాతావరణం, ఇది ఈ ప్రాంత భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దేశ్వర దేవుని వద్ద విశేషాలు ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలతో నిండిన ఈ ప్రాంతం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుండడంతో సందేహం లేదు. ద

kumaram bheem asifabad- అడవికే అందం...సిద్దేశ్వర గుహలు
లోగో

- పర్యాటక కేంద్రంపై పాలకుల నిర్లక్ష్యం

బెజ్జూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చుట్టు దట్టమైన అటవీ ప్రాంతం ఎతైన గుట్టలు, దారి పొడవున ఏపుగా పెరిగిన పెద్ద చెట్లు, పక్షుల కిలకిలరావాలు, అన్ని కాలాలు నీరందించే నీటి గుండాలు, భీముడి పాదముద్రలు సిద్దయ్య దేవుడి సొరంగ మార్గం, అందమైన ప్రకృతి ఆహ్లాదకర వాతావరణం, ఇది ఈ ప్రాంత భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దేశ్వర దేవుని వద్ద విశేషాలు ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలతో నిండిన ఈ ప్రాంతం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుండడంతో సందేహం లేదు. దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్నందున ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్శిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకవైపు ఆధ్యాత్మికతను పంచుతూనే మరోవైపు ప్రకృతి ప్రేమికులకు అటవీ అందాలను ఆస్వాదించేలా ఉంటడంతో ఇక్కడికు వచ్చేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. వర్షాకాలం కావడంతో ప్రకృతి మొత్తం పచ్చని చీరకట్టుకునేలా ఆకర్శిస్తుండటం వల్ల భక్తులు రావడానికి ఇష్టపడతారు.

- మండల కేంద్రానికి సమీపంలో..

బెజ్జూరు మండల కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో రమణీయ ప్రకృతి సౌందర్యాల మధ్య నెలకొని ఉన్నాయి సిద్దేశ్వర గుహలు. ఎన్నో చారిత్రక విశేషాలు కలిగిన ఈ ప్రదేశం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. ద్వాపార యుగంలో పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతం గుండా వెళ్లుతూ కొద్ది రోజులు ఇక్కడే గడిపినట్లు చర్రిత చెబుతారు. ఆ సమయంలో నల్లని రాళ్లపై ఏర్పడిన భీముని పాదాలు నేటికి స్పష్టంగా దర్శణమిస్తున్నాయి. అంతే కాకుండా సిద్దేశ్వర గుహల వద్ద సొరంగ మార్గం ద్వారా కాశీకి చేరుకోవచ్చని ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. కాలక్రమేనా సొరంగ మార్గం పూర్తిగా మూసుకు పోయింది. కాగా సిద్దేశ్వర దేవుడుగా పిలువబడుతూ ఎంతో మంది భక్తులకు కొంగు బంగారంగా మారి భక్తులు కోరిన కోరికలను తీరుస్తున్నాడు. ఈ ప్రాంతానికి బెజ్జూరు మండల వాసులే కాకుండా కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్‌ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. సిద్దేశ్వరుడితో పాటు శివలింగం వద్ద పూజలు చేస్తారు.

- తాగునీటికి గుండాలు..

సిద్దేశ్వర గృహల వద్దకు వచ్చిన భక్తులకు తాగునీటికి పక్కనే నీటి గుండాల వద్ద నీటిని తాగుతారు. ఇక్కడి దర్శణానికి వచ్చిన భక్తులు ఇక్కడే వంట కార్యక్రమాలు చేసి తింటుంటారు. వీరికి గుండాల్లో ఉన్న నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. నీటి గుండాల వద్ద ఏమరపాటుగా ఉంటే ప్రమాదాలు సంభవిస్తాయి. నీటి గుండాలు చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉంటారు. వేసవి కాలంలో సందర్శించే భక్తులకు కొంత నీటి కోసం ఇబ్బందులు పడాల్సిందే.సిద్దేశ్వర గుహలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో సరైన రోడ్డు సదుపాయం లేక భక్తులు ఈ ప్రాంతానికి కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే బెజ్జూరు మండల కేంద్రానికి చేరుకుని అటవీ ప్రాంతంలో కాలిబాటలో 12 కిలో మీటర్లు నడిచి చేరుకోవచ్చు. మరో మార్గం ద్వారా మండలంలోని లోడ్‌పల్లి గ్రామం వద్ద నుంచి కూడా చేరుకోవచ్చు.

- ఆదరణ కరువు..

ఇంత చారిత్ర విశేషాలు ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించడం భక్తులను కలిచి వేస్తోంది. ఈ ప్రాంతం భక్తులను ఆకర్షిస్తుండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే రోడ్డు సదుపాయం కలిగే అవకాశం ఉంది. అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల హక్తులు కాలినడక నడవాల్సి ఉంటుంది. దీంతో భక్తులకు ఇబ్బంది తప్పడం లేదు. భక్తుల నమ్మకాన్ని చూరగొన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక ప్రదేశంగా తీర్చాలని కోరుతున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో అటవీశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు.

రవాణా సదుపాయం కల్పించాలి..

- తంగడిపల్లి మహేష్‌, రంగనాయక ఆలయ కమిటీ అధ్యక్షుడు

అధికారులు ఇక్కడికి చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పించాలి. సిద్దేశ్వర గుహలకు ఎంతో ప్రాచుర్యంతో పాటు ఆధ్యాత్మికంగానే మంచి పేరు ఉంది. భక్తులు నిత్యం ఈ ప్రాంతానికి వస్తుంటారు. దీంతో సరైన దారి లేక భక్తులు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి రవాణా సౌకర్యం కల్పిస్తే మేలు కలుగుతుంది. దీంతో పాటు అటవీ శాఖ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుటుంది.

Updated Date - Sep 06 , 2026 | 11:08 PM