kumaram bheem asifabad- ‘మృగశిర’ సందడి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:03 PM
జిల్లాలో మృగశిర కార్తె ప్రారంభం రోజున సోమవారం చేపల కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. వాంకిడి మండల కేంద్రంలో శనివారం చేపల వ్యాపారం జోరుగా సాగింది. మృగశిర కార్తే రోజును పురస్కరించుకుని ప్రజలు చేపల కొనుగోలుకు పరుగులు తీశారు. ఈ సందర్బంగా మార్కెట్‌లో చేపల వ్యాపారానికి గిరాకి పెరిగింది. బంబార, నవేధరి, నార్లపూర్, చిక్లి, చెరువులతో పాటు అడ ప్రాజేక్టు, వాంకిడి పెద్ద వాగు నుండి చేపలను తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరుపుకున్నారు. వాటి వంటకాలు తినడం ద్వారా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం.
వాంకిడి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మృగశిర కార్తె ప్రారంభం రోజున సోమవారం చేపల కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. వాంకిడి మండల కేంద్రంలో శనివారం చేపల వ్యాపారం జోరుగా సాగింది. మృగశిర కార్తే రోజును పురస్కరించుకుని ప్రజలు చేపల కొనుగోలుకు పరుగులు తీశారు. ఈ సందర్బంగా మార్కెట్‌లో చేపల వ్యాపారానికి గిరాకి పెరిగింది. బంబార, నవేధరి, నార్లపూర్, చిక్లి, చెరువులతో పాటు అడ ప్రాజేక్టు, వాంకిడి పెద్ద వాగు నుండి చేపలను తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరుపుకున్నారు. వాటి వంటకాలు తినడం ద్వారా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం. మృగశిరి కార్తే రోజు కావడంతో చేపల ధరలను వ్యాపారులు పెంచారు. దీంతో కిలో చేపలకు కిలో 250 నుంచి 300 వరకు ధర పలికింది.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మృగ శిరకార్తె సందర్భంగా సోమవారం మండల ప్రజలు చేపల కోసం పరుగులు తీశారు. మండల కేంద్రంలోని బోలు చెరువు, గొల్లబాయి చెరువు, ఇక్కడ చెరువుల వద్ద మత్స్యకారులు చేపలు పట్టగా పెద్ద మొత్తంలో ప్రజలు కొనుగోలు చేసేందు కు పురుగులు తీశారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో కొనుగోలు దారులు పరుగులు తీశారు.