సర్‌పై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఖండించాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:08 PM
సర్‌పై కాంగ్రెస్ చేస్తు న్న అరాచకాలను ప్రతీ ఒక్కరు ఖండించాలని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిటి జన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : సర్‌పై కాంగ్రెస్ చేస్తు న్న అరాచకాలను ప్రతీ ఒక్కరు ఖండించాలని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిటి జన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో కొన్ని విచ్చిన్న శక్తులు అలజడులు సృష్టించడానికి నిరసనల పేరుతో ఆందోళనలు చేపడుతున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్ వల్ల ఒక్రమ చొరబాటు దారుల, చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించారు తప్ప దేశంలోని ఏ ఒక్క అర్హుని పేరు తొలగించలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ విదేశీ శక్తులతో కలిసి ఆందోళనల పేరుతో దేశంలో అలజడులు సృష్టించి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలం దరు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, పుర ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.