బాలికల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:34 PM
బా లికల ఆరోగ్య సంరక్షణే లక్ష్యమని జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి కేకృష్ణ అన్నారు. నాగర్‌క ర్నూల్ జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురు కుల బాలికల పాఠశాలను ఆయన శనివారం పరిశీలించారు.
- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే కృష్ణ
కందనూలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : బా లికల ఆరోగ్య సంరక్షణే లక్ష్యమని జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి కేకృష్ణ అన్నారు. నాగర్‌క ర్నూల్ జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురు కుల బాలికల పాఠశాలను ఆయన శనివారం పరిశీలించారు. బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయ న తనిఖీ చేశారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆ యన తెలిపారు. మహాత్మాజ్యోతిబా ఫూలే గురు కుల పాఠశాలలో ఈ నెల 14వ తేదీ నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ప్రత్యే క హెచ్‌పీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తు న్న ట్లు ఆయన తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు ఈహెచ్‌పీ వ్యాక్సిన్ ఎంతో రక్షణనిస్తుందని, అర్హులైన బాలికలందరూ వం దశాతం వ్యాక్సిన్ పూర్తయ్యేలా చూడాలని వైద్య సిబ్బంది ఆదేశించారు.