kumaram bheem asifabad- పేదలకు పని కల్పించడమే ధ్యేయం
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:14 PM
పేదలకు పని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంను మెరుగు పరుస్తూ వీబీజీరాంజీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర రోజ్‌గర్ అండ్ ఆ జీవికా మిషన్ గ్రామీణ చట్టం అమలు చేస్తుందన్నారు.
కౌటాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పేదలకు పని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంను మెరుగు పరుస్తూ వీబీజీరాంజీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర రోజ్‌గర్ అండ్ ఆ జీవికా మిషన్ గ్రామీణ చట్టం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా 100 రోజుల పని దినాలను 125కు పెంచిందన్నారు. జాబ్ కార్డు ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న వారికి వేతనాన్ని ఇచ్చే విధంగా చట్టంలో మార్పులు తీసుకు రావడం అభివనందనీయమని చెప్పారు. అలాగే గ్రామాల్లో జల సంరక్షణ జీవనోపాధి గ్రామీణ ఆస్తుల సృష్టి, విపత్తులను తట్టుకునే మన్నికైనా గ్రామీణ మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని మెరుగు పరుస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావడం వల్లే మహాత్మాగాంధీ పేరు మార్చారని అన్నారు. దీనిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు ఈ చట్టాన్ని చదివితే అర్థమవుతుందన్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.11.71 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.6.73 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గతంలో ఇందిరా గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు పథకం పేర్లు మార్చారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో నాయకులు వానుపటేల్, సత్తయ్య, భూమయ్య, తిరుపతి, హనుమంతు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.