Share News

kumaram bheem asifabad- దివ్యాంగుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:19 PM

దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని కలెక్టరేట్‌ ఛాంబర్‌లో బుధవారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో దివ్యాంగులకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

kumaram bheem asifabad- దివ్యాంగుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని కలెక్టరేట్‌ ఛాంబర్‌లో బుధవారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో దివ్యాంగులకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చేయూత పెన్షన్‌ పంపిణీ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, ప్రత్యేక టాయిలెట్‌ వసతి ఉండేలా, సదరం శిబిరాల వద్ద వీల్‌ చైర్‌లు, హెల్పర్లు, తాగునీటి వసతి ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్‌ ప్రకారం పథకాలలో అర్హులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులపై అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి మండలంలో అధికారులతో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామి తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, విద్యా, వైద్యా, సంక్షేమాధికారులు, దివ్యాంగుల హక్కుల సమితి సభ్యులు ఇస్లాంబీన్‌ అహ్మద్‌, వెంకటేశ్‌, రవి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ఆసిఫాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి వీసీ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్‌లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్యాదేవరాజన్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం పనులు, తాగునీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆ నిధులతో గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీలలో అత్యవసర పనులకు నిధులు ఖర్చు చేయాలని గత పంచాయతీ పాలక వర్గంలో సర్పంచ్‌లు చేసిన పనుల పూర్తి రికార్డులు సమర్పించినట్లయితే వాటికి నిధులు కేటాయించాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో ఉమర్‌ హుస్సేన్‌, హరిప్రసాద్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పారిశుధ్యం, విద్యుత్‌ దీపాలు, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. పంచాయతీలలో రహదారుల మరమ్మతుల, అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుం టామని వివరించారు. గ్రామ సమాఖ్య భవనాలు, గ్రామ పంచాయతీ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:19 PM