ఆర్టీసీలో టీఎస్టీ, ఎంఎస్టీ పరీక్ష ఫలితాలు విడుదలV
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:04 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
ఈనెల 16, 17న ధ్రువపత్రాల పరిశీలన
వివరాలు వెల్లడించిన పోలీసు నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల మార్కులు, ఓఎంఆర్ షీట్ల కాపీలు, తుది కీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాల గణాంకాలను ఆయన వివరి స్తూ.. టీఎస్టీ విభాగంలో 15,796 మంది పరీక్షకు హాజరుకాగా 9,377 మంది (59.36 శాతం) అర్హత సాధించారని, ఎంఎ్‌సటీ విభాగంలో 4,817 మందికి గాను 2,755 మంది (57.19 శాతం) ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ)లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను ఈనెల 12న ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులకు సందేహాలుంటే మెయిల్ ద్వారా లేదా పనివేళల్లో 9391005006 నంబరుకు సంప్రదించాలని శ్రీనివాసరావు సూచించారు.