Share News

తాత్కాలిక ఉద్యోగులుగా రెండేళ్లు చాలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:29 AM

కారుణ్య నియామకాలపై టీజీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు తాత్కాలిక ఉద్యోగిగా పని చేసిన తర్వాత వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చాలని...

తాత్కాలిక ఉద్యోగులుగా రెండేళ్లు చాలు

  • కారుణ్య నియామకాలపై టీజీఎ్‌సఆర్టీసీ బోర్డు నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకాలపై టీజీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు తాత్కాలిక ఉద్యోగిగా పని చేసిన తర్వాత వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చాలని ఇటీవల జరిగిన సంస్థ బోర్డు సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ సర్క్యులర్‌ జారీ చేసింది. 2022లో నాటి ప్రభుత్వం మూడేళ్లు తాత్కాలిక ఉద్యోగిగా పని చేయాలని, ఆ సమయంలో రిమార్కు లేకుంటేనే రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమిస్తామని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయాన్ని కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు.

Updated Date - Mar 06 , 2026 | 03:29 AM