కార్మికుల భద్రతే మా ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:55 AM
టీజీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని సంస్థ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. జాతీయ భద్రతా వారోత్సవాల....
టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని సంస్థ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. జాతీయ భద్రతా వారోత్సవాల (మార్చి 1 నుంచి 7 వరకు) సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో నిర్వహించిన ‘భద్రతా దినోత్సవం’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, వర్క్‌షాష్‌లు, ఉత్పత్తి యూనిట్లలో సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి ఏడాది మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటామని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి భద్రతపై అవగాహన కల్పించేలా జోనల్ వర్క్‌షా్‌పలు, బాడీ బిల్డింగ్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేశామని నాగిరెడ్డి తెలిపారు.