రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:20 AM
రెగ్యులర్, రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీఈజేఏసీ డిమాండ్ చేసింది.
టీజీఈజేఏసీ నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రెగ్యులర్, రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీఈజేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ రెండో తేదీ లోపు రెండో వేతన సవరణ కమిషన్ నివేదికను తెప్పించడంతోపాటు ఉద్యోగులకు 51ు ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.