Share News

టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు వాయిదా

ABN , Publish Date - May 20 , 2026 | 03:26 AM

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పీజీఈసెట్‌)-2026 మొదటి రోజు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 28న బక్రీద్‌ సెలవు దినంగా ప్రభుత్వం...

టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు వాయిదా

  • జూన్‌1కి రీషెడ్యూల్‌

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి) : పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పీజీఈసెట్‌)-2026 మొదటి రోజు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 28న బక్రీద్‌ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ రోజు ఉదయం సెషన్‌లో జరగాల్సిన జియో ఇంజనీరింగ్‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌, ఫార్మసీ పరీక్షలతో పాటు మధ్యాహ్నం సెషన్‌లో జరగాల్సిన సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలను జూన్‌ 1వ తేదీకి రీషెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు పీజీఈసెట్‌ కన్వీనర్‌ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 29, 30, 31వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2026 | 03:26 AM