Share News

శిశువు చేయి తొలగింపు ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:07 AM

ఖమ్మం ప్రభుత్వ మాతా, శిశు సంక్షేమ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నెలలు నిండని శిశువు చేయి తొలగించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం..

శిశువు చేయి తొలగింపు ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

  • ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించి, సుమోటోగా కేసు స్వీకరణ

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం ప్రభుత్వ మాతా, శిశు సంక్షేమ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నెలలు నిండని శిశువు చేయి తొలగించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (టీజీహెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నెలలు తక్కువని వస్తే.. వికలాంగుడిగా మార్చారు!’’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై కమిషన్‌ స్పందిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అమానుష ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించి, సమగ్ర నివేదిక సమర్పించాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారిని (డీఎంహెచ్‌వో) ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్‌ 29న కమిషన్‌ ముందు నిర్వహించనున్నారు. ఆ లోగా సంబంధిత అధికారులు నివేదిక సమర్పించాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - Jun 01 , 2026 | 05:07 AM