Share News

ఆ 186 మంది వైద్యులకే బదిలీల్లో మినహాయింపు: టీజీజీడీఏ

ABN , Publish Date - May 20 , 2026 | 03:18 AM

ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యుల (ఆఫీస్‌ బేరర్స్‌) మినహాయింపులు, కొనసాగింపులపై వస్తున్న వార్తల్లో ..

ఆ 186 మంది వైద్యులకే బదిలీల్లో మినహాయింపు: టీజీజీడీఏ

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యుల (ఆఫీస్‌ బేరర్స్‌) మినహాయింపులు, కొనసాగింపులపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజీజీడీఏ) స్పష్టం చేసింది. సంఘం ప్రతినిధుల బదిలీల మినహాయింపుల దరఖాస్తులను ప్రభుత్వ ఉత్తర్వులు, బదిలీల మార్గదర్శకాలకు లోబడే సమర్పిస్తున్నట్లు తెలియజేసింది. దాదాపు 600 మంది వైద్యులు బదిలీల నుంచి మినహాయింపులు కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అసోసియేషన్‌ ఖండించింది. వాస్తవానికి దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న కేటగిరిలో టీజీజీడీఏకు చెందిన కేవలం 186మంది కార్యవర్గ సభ్యులే ఉన్నారని స్పష్టం చేసింది. ఇందులో 123 మంది జిల్లాల్లో మిగిలిన వారు జీహెచ్‌ఎంసీ పరిధిలో ేసవలు అందిస్తున్నారని సంఘం వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనలను తాము పూర్తిగా గౌరవిస్తామని, బదిలీల పాలసీకి లోబడే అన్ని అభ్యర్థనలు ఉంటాయని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బి. నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌. లాలూ ప్రసాద్‌ రాథోడ్‌ స్పష్టం చేశారు.

Updated Date - May 20 , 2026 | 03:18 AM