Share News

నేడు టీజీ ఈసెట్‌-2026 నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:27 AM

డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్‌) అర్హత కలిగిన విద్యార్థులకు లాటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...

నేడు టీజీ ఈసెట్‌-2026 నోటిఫికేషన్‌ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్‌) అర్హత కలిగిన విద్యార్థులకు లాటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈసెట్‌-2026 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల కానుంది. ఈ మేరకు కన్వీనర్‌ పి.చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షను ఏప్రిల్‌ 18న ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 500 కాగా, ఇతరులకు 900గా నిర్ణయించామన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 04:27 AM