జూలైలో సీపీ గేట్‌పరీక్షలు
ABN , Publish Date - May 14 , 2026 | 04:30 AM
తెలంగాణ స్టేట్ కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్-26 (టీజీ సీపీ గేట్) షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ ...
కేయూ క్యాంపస్ మే 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్ కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్-26 (టీజీ సీపీ గేట్) షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి అధికారులు, వీసీలు, కన్వీనర్‌తో జరిగిన సమావేశంలో సీపీ గేట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి జూన్ 10 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 16 నుంచి 19 వరకు దరఖాస్తుల తప్పులను సవరించుకునే అవకాశం కల్పించారు. జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ కె.రాజేందర్ తెలిపారు.