Share News

డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా స్కోచ్‌అవార్డు

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:26 AM

రాష్ట్రంలో నాణ్యమైన డిజిటల్‌ సేవలను అందించే దిశగా చర్యలను వేగవంతం చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం టీ-ఫైబర్‌ను ఆదేశించారు.

డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా స్కోచ్‌అవార్డు

  • టీ-ఫైబర్‌ను అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాణ్యమైన డిజిటల్‌ సేవలను అందించే దిశగా చర్యలను వేగవంతం చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం టీ-ఫైబర్‌ను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ-ఫైబర్‌ సేవలను ప్రాధాన్యతా క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీ పన్నీరు వేణుప్రసాద్‌కు సూచించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడంతో పాటు, ఈ-గవర్నెన్స్‌ సేవలకు బలమైన డిజిటల్‌ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. ‘తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌’ (టీ-ఫైబర్‌)కు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డు-2026 దక్కింది. ఈ మేరకు న్యూఢిలీల్లో ‘వికసిత్‌ భారత్‌ కోసం నియంత్రణ చట్రం’ అనే అంశంపై నిర్వహించిన 108వ స్కోచ్‌ సదస్సులో టీ-ఫైబర్‌ ఎండీ వేణుప్రసాద్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా టీ-ఫైబర్‌ ఎండీ, అధికారులు ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి సంస్థకు దక్కిన అవార్డు గురించి వివరించారు.

Updated Date - Jun 22 , 2026 | 04:26 AM