Share News

టీ-ఫైబర్‌కు స్కోచ్‌ అవార్డు

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:37 AM

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (టీ-ఫైబర్‌)కు ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌’ అవార్డు దక్కింది. ఇటీవల నిర్వహించిన పలు విభాగాలన్నింటిలో ...

టీ-ఫైబర్‌కు స్కోచ్‌ అవార్డు

  • ఈ నెల 20న న్యూఢిల్లీలో ప్రదానం

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (టీ-ఫైబర్‌)కు ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌’ అవార్డు దక్కింది. ఇటీవల నిర్వహించిన పలు విభాగాలన్నింటిలో టీ-ఫైబర్‌ అగ్రభాగాన నిలిచి ఈ అవార్డును దక్కించుకుందని నిర్వాహకులు కార్పొరేషన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జూన్‌ 20న ‘వికసిత్‌ భారత్‌ కోసం నియంత్రణ చట్రం’ అనే అంశంపై 108వ స్కోచ్‌ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సదస్సులోనే టీ-ఫైబర్‌కు స్కోచ్‌ అవార్డును ప్రదానం చేయనున్నామని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని టీ-ఫైబర్‌కు ఆహ్వానం అందించారు.

Updated Date - Jun 06 , 2026 | 04:37 AM