భాగ్యనగరానికి ‘టెస్లా'!
ABN , Publish Date - May 23 , 2026 | 04:37 AM
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తమ సరికొత్త విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఇండియా జనరల్ మేనేజర్ ...
దేశంలో4 కేంద్రాలు..హైదరాబాద్‌లో ఐదోది
సంస్థ ప్రతినిధులతో మంత్రి దుద్దిళ్ల భేటీ
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తమ సరికొత్త విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, డైరెక్టర్ రజత్‌లతో కూడిన బృందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో శుక్రవారం భేటీ అయింది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో అమ్మకాలు ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్తు వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక ఎకోసిస్టంను రాష్ట్రంలో బలోపేతం చేసినట్టు వివరించారు. సంస్థ దీర్ఘకాలిక సాంకేతిక లక్ష్యాలకు రాష్ట్రంలో ఉన్న వాతావరణం బాగా సరిపోతుందన్నారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్‌వేర్, ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాలకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎదిగిందని చెప్పారు. దేశంలో టెస్లా ఇప్పటి వరకు నాలుగు ేసల్స్ షోరూంలను ఏర్పాటు చేయగా.. తదుపరి కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశీయ కార్ల మార్కెట్‌లో ఎలక్ర్టిక్ వాహనాల వాటా 45శాతమే ఉన్నందున, వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు.