Share News

రాష్ట్రంలో టెస్లా సంస్థ విస్తరణ

ABN , Publish Date - May 27 , 2026 | 04:22 AM

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ భారత ప్రతినిధుల బృందం ...

రాష్ట్రంలో టెస్లా సంస్థ విస్తరణ

  • మంత్రి పొన్నంతో సంస్థ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ భారత ప్రతినిధుల బృందం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మంగళవారం సమావేశమయ్యారు. టెస్లా సంస్థ అమలు చేస్తున్న డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ విధానం, విక్రయాలు, సర్వీస్‌, డెలివరీ కేంద్రాలు, సూపర్‌ చార్జర్‌ మౌలిక వసతులపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఈవీ ఎకో సిస్టమ్‌ అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణలో సుస్థిర రవాణా వ్యవస్థ బలోపేతానికి, విద్యుత్‌ వాహనాల వినియోగ విస్తరణకు అనుసరించాల్సిన విధానాలపైనా చర్చించారు. టెస్లా ఇండియా జనరల్‌ మేనేజరు శరద్‌ అగర్వాల్‌, పబ్లిక్‌ పాలసీ, బిజినెస్‌ డెల్‌పమెంట్‌ విభాగం చీఫ్‌ రాజత్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 04:22 AM