టెన్షన్..టెన్షన్
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:59 PM
మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన అభ్య ర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కిం పు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. నామినేషన్లు వేసిన నాటి నుంచి అలుపెరగకుండా ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థుల కు ఎన్నికలు పూర్తకావడంతో కాస్తంత ఉపశమనం ల భించినప్పటికీ ఫలితాలపై చాలా మంది గంపెడాశతో ఉ న్నారు.
-నేడు ఓట్ల లెక్కింపు
-తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
-ఎక్కడికక్కడే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
-జిల్లాలో క్యాంపు రాజకీయాలు షురూ
-అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీల తిప్పలు
మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన అభ్య ర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కిం పు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. నామినేషన్లు వేసిన నాటి నుంచి అలుపెరగకుండా ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థుల కు ఎన్నికలు పూర్తకావడంతో కాస్తంత ఉపశమనం ల భించినప్పటికీ ఫలితాలపై చాలా మంది గంపెడాశతో ఉ న్నారు. ఈ సారి ఎన్నికల్లో యువత, రాజకీయానుభ వం లేనివారు అనేక మంది వివిధ పార్టీలు, స్వతం త్రులుగా బరిలో దిగారు. అలాంటి వారంతా తమ అదృ ష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడ్డారు. ఎట్టకేలకు పో లింగ్ ప్రక్రియ ముగియడంతో ఇక ఫలితాల కోసం ఎదు రు చూస్తున్నారు. మరోవైపు శుక్రవారం చేపట్టనున్న ఓ ట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మంచిర్యాల కార్పొరేషన్‌కు సం బంధించి ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, బెల్లంపల్లి మునిసిపాలిటీలోని బజార్ ఏరియాలోగల జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల, చెన్నూరు మునిసిపాలిటీలోని అట వీశాఖ సమీపంలోని జడ్పీ హై స్కూల్, క్యాతనపల్లి ము నిసిపాలిటీలోని ఆర్‌కేసీఓఏ క్లబ్, లక్షెట్టిపేట మునిసిపాలిటీలో పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎక్కడికక్కడే లెక్కింపు కేంద్రా లు ఏర్పాటు చేశారు.
60 వార్డులు....60 టేబుళ్లు....
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపులో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధించి 60 వార్డులు ఉండగా 60 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరి ధిలో మొత్తం 2,01,875 ఓట్లు పోల్‌కాగా ఒక్కో రౌండ్‌కు టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున మొత్తం నాలుగు రౌం డ్లలో లెక్కించనున్నారు. బెల్లంపల్లి మునిసిపాలిటీకి సం బంధించి 34 వార్డులకు గాను 17 టేబుళ్లు ఏర్పాటు చే యగా రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. చెన్నూరు మునిసిపాలిటీలోని 18 వార్డులకు 9 టేబుళ్లు ఏర్పాటు చేయగా, రెండు రౌండ్లలో లెక్కించనున్నారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో 22 వార్డులకు గాను 22 టేబుళ్లు ఏర్పాటు చేయగా, రౌండ్‌కు వెయ్యి ఓట్ల చొప్పు న రెండు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. లక్షెట్టిపేట మునిసిపాలిటీలోని 15 వార్డులకుగాను 8 టేబుళ్లు ఏర్పా టు చేయగా, రెండు రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం మునిసిపాలిటీల వారీగా రౌండ్ల సంఖ్యను బట్టి సరిపడా కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ స హాయకులను నియమించారు.
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు....
ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్‌శాఖ ఆ ధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మొత్తం 800 పై చిలుకు సిబ్బందితో ఎన్నికల బందోబ స్తు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఐదు మునిసి పాలిటీల పరిధిలో ఏసీపీలు 06, సీఐలు 13, ఎస్‌ఐలు 33, ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు 119, కానిస్టేబుళ్లు 375, హోంగార్డులు 166, ఆర్మ్‌డ్ సిబ్బంది 140, క్యూ ఆ ర్‌టీ టీమ్స్, రూట్ మొబైల్ పార్టీలు, ఇతర డిపార్ట్‌మెం ట్‌లకు సంబంధించిన 100 మంది ఎన్నికల బందోబ స్తులో పాల్గొననున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్ సెక్షన్ అమలులో ఉండనుంది. కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, ఫ్లకార్డులు ప్రదర్శించడం, ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిశేధం. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, ట పాకాయలు కాల్చడం వంటి పనులు చేయరాదు.
క్యాంపు రాజకీయాలు షురూ...!
మునిసిపల్ ఎన్నికలు పూర్తయినందున వివిధ రాజ కీయ పార్టీల ఆధ్వర్యంలో క్యాంపు రాజకీయాలు షురూ చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పార్టీలు మా రే అవకాశం ఉండటంతో వారందరినీ రహస్య ప్రాంతా లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల కా ర్పొరేషన్‌లో ఈ క్యాంపు రాజకీయాలు అధికంగా ఉన్నా యి. కార్పొరేషన్ పరిధిలో బీజేపీ తరుపున బరిలో నిలిచి న అభ్యర్థులందరినీ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలించారు. వారందరికీ ఆటవిడుపు కోసం మహారాష్ట్రలోని తడోభా లోని జంగిల్ సఫారీకి ఎన్నికలు ముగిసిన రాత్రికి రాత్రే తరలించారు. అలాగే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తమ అభ్య ర్థులను క్యాంపులకు తరలించే యోచనలో ఉన్నట్లు తె లుస్తోంది. మిగతా మునిసిపాలిటీల్లో కూడా ఇదే ఒరవ డి కొనసాగుతున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు సమ యానికి కూడా వారు అందుబాటులో ఉండటం లేదు. మేయర్/చైర్మన్ ఎన్నిక రోజు ఈ నెల 16వ తేదీన అ భ్యర్థులంతా క్యాంపు నుంచి నేరుగా మునిసిపల్ కార్యాలయాలకు రానున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను ఆయా పార్టీల ముఖ్య నేతలు పార్టీలు మారకుండా కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం.