kumaram bheem asifabad-‘భరోసా’ లేని కౌలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:17 PM
సొంత భూములు లేక కౌలుపైనే ఆధార పడి వ్యవసా యం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభు త్వాలు గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కో సం ప్రభుత్వం నుంచి సాకారం అందక, పండిం చిన పంట అధి కారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో వందల ఎకరాలు కలిగిన భూస్వాములు కనీసం సాగువైపు కన్నెత్తి చూడకపోయినా రైతు బంధు అందుతూ వచ్చింది. కానీ ఆ భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహాయం అందలేదు. దీంతో ఎందరో కౌలు రైతులు పంట చేతికి వచ్చినా..రాకున్నా ..కౌలు మాత్రం కడుతూ వచ్చారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తామని హామీ
- ఇంకా అటువైపుగా అడుగులు పడని వైనం
- ఏటేటా పెరుగుతున్న ఆర్థిక భారం
- జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు
ఆసిఫాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సొంత భూములు లేక కౌలుపైనే ఆధార పడి వ్యవసా యం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభు త్వాలు గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కో సం ప్రభుత్వం నుంచి సాకారం అందక, పండిం చిన పంట అధి కారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో వందల ఎకరాలు కలిగిన భూస్వాములు కనీసం సాగువైపు కన్నెత్తి చూడకపోయినా రైతు బంధు అందుతూ వచ్చింది. కానీ ఆ భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహాయం అందలేదు. దీంతో ఎందరో కౌలు రైతులు పంట చేతికి వచ్చినా..రాకున్నా ..కౌలు మాత్రం కడుతూ వచ్చారు. పండిన పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. పైౖగా వ్యవసాయమే తప్ప ఇతర పని చేయలేని కౌలు రైతులంతా ఏడాదంతా కష్టపడి పండించిన పంటను అధిక శాతం వడ్డీకి తీసుకున్న ప్రైవేటు అప్పులే తీరు స్తున్నవారు అనేకం. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంత వరకు కౌలు రైతులకు అందే సహాయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా ఎప్పుడు తమకు పంట పెట్టుబడి సాయం అందుతుందోనని ఎదురు చూస్తున్నారు.
- అడుగడుగునా కష్టాలే..
కౌలు రైతులకు సీజన్ ప్రారంభం నుంచి ముగి సే వరకు అన్నీ కష్టాలే ఎదుర వుతున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారుగా 30వేల వరకు కౌలు రైతులున్నారు. ప్రభుత్వ ఉద్యో గులు, వ్యాపారులు, ఇతరత్రా రంగాలకు చెందిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేక పోవడంతో పాటు సాగు కష్టాలను ఎదర్కొనే పరిస్థితులు లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చే స్తుంటారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహా యం పట్టాదారు రైతుల ఖాతాల్లోనే జమవుతూ వచ్చింది. దీంతో పంటను సాగు చేసిన కౌలు రైతు పేరే ఎక్కడా లేకుండా పోయింది. గత ప్రభుత్వం అందించిన రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అదే పరి స్థితి నెలకొంది. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.
- పెరుగుతున్న పెట్టుబడులు..
రోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతు న్నాయి. ఒక ఎకరంలో పత్తి పంట వే యాలంటే సుమా రుగా రూ. 25వేలు, వరి పొలానికి రూ. 23 నుంచి 25 వేలు, మొక్క జొన్న చేనుకు రూ. 20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కౌలు డబ్బులు కాకుండా కౌలు కుటుంభీకుల కష్టం పోను విత్తనాలు, ఎరువులకే అధిక పెట్టుబడి వెచ్చించాల్సిన పరిస్థితి. ఎంత కష్టప డినప్పటికీ ఎకరానికి రూ. 10 వేల నుంచి 15వేల వరకు మిగి లే పరిస్థితి లేదు. మరోవైపు ఏటేటా విత్తనాలు, ఎరువులు ధరలు పెరుగుతున్నాయి. కౌలు ధరను సైతం పెంచాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2018 నుంచి రైతు బంధు అమలు చేయగా అప్పటి నుం చి కౌలు రైతులకు ఎదో ఒక రూపకంగా ప్రభుత్వం సాయం చేయాలన్న డిమాండ్ ఉన్నది.
- అమ్ముకోవడానికి సైతం తిప్పలు..
కౌలు రైతులు తాము పండించిన పంటను అమ్ము కోవడానికి సైతం తిప్పలు పడుతున్నారు. పట్టాదారు కల్గిన రైతులే అమ్ముకోవడానికి వీలు ఉండడంతో కౌలు రైతులు తక్కువ ధరకే దళారు లకు విక్రయిం చాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులను గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతు భరోసా పథకం రూ. 15వేల సాయం వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో కొంత మేర రైతులు నష్టపోకుండా ఉంటారని ప్రభుత్వం త్వరగా కౌలు రైతులపై విధివిధానాలు ఖరారు చేయాలని పలు వురు కోరుతున్నారు.