kumaram bheem asifabad- కౌలు.. గుబులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:36 PM
సెంటు భూమి లేకపోయినా వ్యవసాయంపై ఆధారపడి సాటి రైతుల భూములను కౌలుకు తీసుకొని కాలం వెల్లదీస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవక పంట పొలాలు ఎండిపోతున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలేవి వర్తించకపోవడంతో అప్పులపాలవుతున్నామని, బ్యాంకులు సైతం రుణాలివ్వకపోవడంతో ప్రైవేలు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని మదన పడుతున్నారు.
- కౌలు చెల్లించేందుకు అప్పులపాలు
- వర్షాభావంతో ఎండిపోయిన పంటలు
- ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతుల వినతి
బెజ్జూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సెంటు భూమి లేకపోయినా వ్యవసాయంపై ఆధారపడి సాటి రైతుల భూములను కౌలుకు తీసుకొని కాలం వెల్లదీస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవక పంట పొలాలు ఎండిపోతున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలేవి వర్తించకపోవడంతో అప్పులపాలవుతున్నామని, బ్యాంకులు సైతం రుణాలివ్వకపోవడంతో ప్రైవేలు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని మదన పడుతున్నారు. ఎల్నినో ఎఫెక్టుతో పంట చేతికందేలా లేదని, పెట్టిన పెట్టుబడి సైతం వచ్చేలా లేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు పట్టాదారుల నుంచి ఎకరాకు సుమారు రూ. 10 నుంచి 15 వేల చెల్లించే ఒప్పందంపై సాగు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితుల్లో పంట సాగుకు పెట్టిన పెట్టుబడులే దక్కని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక కౌలు చెల్లించేందుకు అప్పులు చేయక తప్పని దుస్థితి ఉందని వాపోతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేలకు పె ౖగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన వారి భూములను కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న వారు కడు పేదరికంతో ఉన్నవారే. జిల్లాలో రెండు, మూడెకరాలు భూములు ఉన్న వారు, ఉద్యోగాలు, వ్యాపారాలతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు, భూములను సాగు చేయనివారు వారి భూముల ను ఇతరులకు కౌలుకిచ్చారు. తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూములను అమ్మడానికి మనస్సురాక ఎందరో కౌలుకు ఇచ్చి భూములను కాపాడుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి కౌలుకు భూములను సాగు చేస్తున్న రైతులు వర్షాభావ పరిస్థితులతో కౌలు చెల్లించేదెట్లా? అని ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల ముందుగానే కౌలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పంట పండుద్దని ఆశతో బంధువులు, తెలిసిన వారి వద్ద అప్పు తీసుకొని మరీ కౌలు చెల్లించామని, పంట నష్టపోయినా పట్టాదారులకు పూర్తి కౌలు ఇవ్వక తప్పదని వాపోతున్నారు.
- చట్టబద్ధత లేక..
ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు చట్టవద్దత లేక కౌలు రైతులు కుదేలవుతున్నారు. పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మొత్తం పట్టా రైతులకే ప్రభుత్వం ఇస్తుందని కౌలు రైతులు చెబుతున్నారు. జిల్లాలో చాలావరకు కౌలు రైతులు పత్తి, వరి ఇతర పంటలు సాగు చేశారు. పత్తి, వరి పంట నిలువునా ముంచే పరిస్థితి ఉందంటున్నారు. ఈ దశలో కౌలు ఎలా చెల్లించాలో తోచడం లేదంటున్నారు. అయితే రైతులు సాగు చేసినా, చేయకపోయినా రైతుభరోసా మాత్రం పట్టాదా రులకు మాత్రమే వస్తుండడం కౌలు రైతులకు నష్టంగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కౌలు రైతులను ఆదుకోవడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా బోనస్ కౌలు రైతులకందిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు.
పంట కోల్పోయాం..
- గుర్లె అంజయ్య, కౌలు రైతు
ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వానాకాలం పంట కోల్పోయాం. మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఇప్పటి వరకు సాగుకు వేల రూపాయలు ఖర్చు చేశాను. వర్షాలు లేక దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. వచ్చిన దాంల్లో నుంచే కౌలు చెల్లించాలి. ఇక సాగు చేసిన మాకు నష్టాలు తప్పవు. కౌలుదారులను ప్రభుత్వం ఆదుకోవాలి.
కౌలు రైతులకే పరిహారం చెల్లించాలి..
- కొట్రంగి వసంత్, కౌలు రైతు, ఎల్కపల్లి
వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపో తున్నాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారాన్ని కౌలు రైతులకు ఇవ్వాలి. సాగుకు ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాం. పంటలు పండకపోతే మా కుటుంబాల పోషణ ఇబ్బందికరం గా ఉంటుంది. ప్రభుత్వం కనికరించి కౌలు రైతు లను ఆదుకోవాలి.