Share News

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:49 PM

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జి ల్లా విద్యాధికారి యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం రెగ్యులర్‌ విద్యార్థులు 9682 మంది విద్యార్థులు కాగా 27 మంది గైర్హాజర య్యా రు.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాల గర్మిల్ల పాఠశాల వద్ద పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాశ్‌

మంచిర్యాలక్రైం, మార్చి14 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జి ల్లా విద్యాధికారి యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం రెగ్యులర్‌ విద్యార్థులు 9682 మంది విద్యార్థులు కాగా 27 మంది గైర్హాజర య్యా రు. గతంలో ఫెయిల్‌ అయిన విద్యారు లు 7గురు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. మొత్తం 99.72శాతం హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆర్‌బీహెచ్‌వి పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు.

గెలుపు ఓటములు సహజం....

డీసీపీ భాస్కర్‌...

జీవితంలో గెలుపు ఓటములు సహజమని పరీక్షలు ఒక మెట్టు అని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ల సందర్భంగా మంచిర్యాల గర్మిళ్ల పాఠశాల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎన్‌ఎస్‌ 163 అమలులో ఉంటుందని పరీక్ష కేంద్రంలో ఎ వరు కూడ గుమిగూడి ఉండరాదన్నారు. ప రీక్ష కేంద్ర సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రా యాలన్నారు. చరిత్రలో గొప్ప గొప్పవారు మొ దటి సారి ఓటమెరిగినవారేనని అన్నారు. పరీ క్ష ఒక మెట్టు అని పరీక్షలు విఫలమైన ప్ప టికీ మరోసారి పరీక్ష రాసి విజయం పొందవ చ్చునన్నారు. గెలుపు ఓటములు రుచి చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మార్కులను కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంపొందించే విధంగా చూడాలన్నారు. విద్యనే జీవితం కాదని ఎన్నో రంగాల్లో రాణించి గొప్పవారైనవారు ఉన్నారన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:49 PM