Share News

kumaram bheem asifabad- శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:05 PM

జిల్లాలో శుక్రవారం నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలను ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌ కోదండరామలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనకాపూర్‌ ఆలయం నుంచి పాత అటవిశాఖ చెక్‌పోస్టు వరకు ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు మైకులు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:03 గంటలకు పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్‌ లగ్నసుముహుర్తంన జరుగనున్న కల్యాణ వేడుకకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. గురువారం ఆలయం వద్ద పందిర్లు వేసి పాలపొరక కార్యక్రమంతో పాటు తలంబ్రాల తయారీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఇరుకుల్ల మంగ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

kumaram bheem asifabad- శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు
విద్యుత్‌ దీపాల అలంకరణలో కోదండ రామాలయం

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలను ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌ కోదండరామలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనకాపూర్‌ ఆలయం నుంచి పాత అటవిశాఖ చెక్‌పోస్టు వరకు ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు మైకులు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:03 గంటలకు పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్‌ లగ్నసుముహుర్తంన జరుగనున్న కల్యాణ వేడుకకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. గురువారం ఆలయం వద్ద పందిర్లు వేసి పాలపొరక కార్యక్రమంతో పాటు తలంబ్రాల తయారీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఇరుకుల్ల మంగ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. కోదండ రామలయంలోని శ్రీ సీతరామ, లక్ష్మణ, హనుమాన్‌ సమేతంగా ఉన్న గర్బగుడితో పాటు శివాలయం, సాయి మందిరాన్ని పూలంతో అందంగా అలంకరించారు. మహిళలు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ ఆధ్వర్యంలో కల్యాణానికి కావాల్సిన తలంబ్రాలను సిద్ధం చేశారు. కాగా శ్రీరామ నవమిని పురష్కరించుకొని ఆలయ అవరణలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుండగా గత మూడేళ్ల నుంచి జిల్లా కేంద్రానికి చెందిన వేద పండితుడు నిమ్మకంటి సంతోష్‌శర్మ అన్నదానం చేపడుతు న్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి పర్వ దినాన్ని పురస్కరించుకొని మండలం లోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. మండల కేంద్రంతో పాటు ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్‌, సలుగుపల్లి, బారెగూడ తదితర గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కుమరం భీం చౌరస్తాలో శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్‌ రాజేష్‌ తెలిపారు. సుమారు పది వేల నుంచి పదిహేను వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తనెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, సిబ్బంది రాజేందర్‌, లింగేష్‌ పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలని శ్రీ కోదండరామాలయంతో పాటు గోలేటి, వంకులం గ్రామాల్లో కోదండరామాలయాల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. గోలేటిలో సింగరేణి యజమాన్యం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని వైభవం నిర్వహిస్తారు. రెబ్బెన, వంకులం గ్రామాల్లో కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి):మండలంలో ఆలయాలు శ్రీరామనవమికి ముస్తాబ య్యాయి. ఈ మేరకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - Mar 26 , 2026 | 11:05 PM