పుష్కరాల వరకు ఆలయ నిర్మాణం పూర్తి
ABN , Publish Date - Nov 26 , 2026 | 11:16 PM
పుష్కరాల వరకు ఆలయ నిర్మాణం పూర్తవుతుందని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సు రేఖ అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాధ ఆల య పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శం కుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
శంకుస్ధాపన కార్యక్రమంలో కొక్కిరాల సురేఖ
మంచిర్యాలక్రైం/గర్మిళ్ల నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : పుష్కరాల వరకు ఆలయ నిర్మాణం పూర్తవుతుందని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సు రేఖ అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాధ ఆల య పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శం కుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మిం చనున్న ఆలయ పనుల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, పరమశివుడు, శ్రీ వాసవి మాత ఆలయాల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఎలాంటి ఆ టంకాలు లేకుండా పనులు పూర్తి చేసేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముక్త రవి, మున్సిపల్ డిప్యూ టి మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మ న్ బానేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, రాజేశం, హే మలత, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.