Share News

శ్రీలంకకు తెలుగు అధ్యాపకులను పంపిస్తాం

ABN , Publish Date - May 27 , 2026 | 04:36 AM

శ్రీలంకలోని తెలుగు వారికి తెలుగు భాష నేర్పించేందుకు అవసరమైన అధ్యాపకులు, సామగ్రిని పంపిస్తామని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ ..

శ్రీలంకకు తెలుగు అధ్యాపకులను పంపిస్తాం

  • రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నాం

  • సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ

హైదరాబాద్‌ సిటీ, మే26 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలోని తెలుగు వారికి తెలుగు భాష నేర్పించేందుకు అవసరమైన అధ్యాపకులు, సామగ్రిని పంపిస్తామని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య నిత్యానందరావు వెల్లడించారు. భోజన, వసతి సౌకర్యాలు శ్రీలంక వారు కల్పిస్తే అధ్యాపకులను, పరిశోధక విద్యార్థులను, రిటైర్డు వ్యక్తులను దశలవారీగా పంపిస్తామని తెలిపారు. శ్రీలంకలో ఉన్న ఆరు లక్షల మంది తెలుగు వారికి తెలుగుభాష నేర్పేందుకు సహాయ, సహాకారాలు అందించాలని కోరుతూ ఆల్‌ సిలోన్‌ తెలుగు కాంగ్రెస్‌ అధ్యక్షులు సీఎం అంబలగన్‌ తెలుగు వర్సిటీ వీసీకి ఓ లేఖ రాశారు. దీనిపై ’మాకు తెలుగు నేర్పించండి’ అనే శీర్షికతో పది రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ ఓ వార్తను కూడా ప్రచురించింది. అయితే, ఆ లేఖకు స్పందించిన తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీలంకలోని తెలుగు వారికి తెలుగు నేర్పించేందుకు శ్రీలంక ప్రభుత్వ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలో కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు.

Updated Date - May 27 , 2026 | 04:36 AM