Share News

పార్లమెంటరీ స్నేహ బృందాలకు తెలుగు ఎంపీల నేతృత్వం

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:48 AM

విదేశీ పార్లమెంటరీ బృందాలతో స్నేహాపూర్వక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లోక్‌సభ ఇటీవల అనేక దేశాలకు పార్లమెంటరీ మిత్ర బృందాలను నియమించగా..

పార్లమెంటరీ స్నేహ బృందాలకు తెలుగు ఎంపీల నేతృత్వం

  • కువైట్‌కు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఒమాన్‌కు అసదుద్దీన్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

విదేశీ పార్లమెంటరీ బృందాలతో స్నేహాపూర్వక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లోక్‌సభ ఇటీవల అనేక దేశాలకు పార్లమెంటరీ మిత్ర బృందాలను నియమించగా.. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు నేతృత్వం వహించే అవకాశం దక్కింది. మరికొంత మంది ఎంపీలు వివిధ బృందాల్లో సభ్యులుగా ఎంపికయ్యారు. కువైట్‌ బృందానికి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఒమాన్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ సారథ్యం వహించనున్నారు. ఉక్రెయిన్‌ బృందానికి ధర్మపురి అర్వింద్‌ నాయకత్వం వహించనున్నారు. సౌదీ అరేబియా బృందంలో సభ్యురాలిగా వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఎంపికవగా.. ఆర్‌.కృష్ణయ్య, కె.రఘురాంరెడ్డి, కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డిలు వివిధ దేశాల బృందాలలో సభ్యులుగా నియమితులయ్యారు.

Updated Date - Feb 27 , 2026 | 04:48 AM