Share News

ఒమన్‌లో కన్నుల పండువగా ఎములాడ రాజన్న కల్యాణోత్సవం

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:33 AM

ఏడు కొండల వెంకన్న అయినా.. ఎములాడ రాజన్న అయినా ఎడారుల్లోనూ తెలుగు ప్రవాసీ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. తెలుగు ప్రజల భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం.

ఒమన్‌లో కన్నుల పండువగా ఎములాడ రాజన్న కల్యాణోత్సవం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఏడు కొండల వెంకన్న అయినా.. ఎములాడ రాజన్న అయినా ఎడారుల్లోనూ తెలుగు ప్రవాసీ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. తెలుగు ప్రజల భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం. ఇదే తరహాలో యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ గల్ఫ్‌లో తెలుగు ప్రవాసులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఒమన్‌ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఒమాన్‌ తెలంగాణ సమితి (ఓటీఎస్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై.. సాయంత్రం మహా ప్రసాదంతో ముగిసింది. ఇందులో భారతీయ రాయబారి జీవీ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒమన్‌తో పాటు ఇక్కడి ఇతర దేశాలన్నీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శివపార్వతులను ప్రార్ధించినట్లు ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన నూనె లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 05:34 AM