Share News

సామాజిక న్యాయంలో తెలంగాణ మార్గదర్శకం

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:12 AM

దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, బలహీనవర్గాల సాధికారత, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇతర...

సామాజిక న్యాయంలో తెలంగాణ మార్గదర్శకం

  • ఛండీగఢ్‌ ‘చింతన్‌ శివిర్‌’లో మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, బలహీనవర్గాల సాధికారత, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఛండీగఢ్‌లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చింతన్‌ శివిర్‌-2026’ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల మం త్రులు, ఉన్నతాధికారులతో కలిసి బలహీనవర్గాల సమగ్ర అభివృద్ధిపై జరిగిన చర్చావేదికలో మంత్రి కీలక సూచనలు చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ నమూనాలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. పథకాల అమలులో వేగవంతం, పారదర్శకత కోసం డిజిటల్‌ విధానాలు, డీబీటీ, జియో ట్యాగింగ్‌ వంటి సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. ఈ చింతన్‌ శివిర్‌ ద్వారా రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాల మార్పిడి జరిగిందని, సామాజిక న్యాయ రంగంలో కేంద్ర రాష్ట్రాల మద్య సమన్వయం మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Apr 27 , 2026 | 05:12 AM