Share News

తెలంగాణ ప్రభుత్వానిది పీపుల్స్‌ బడ్జెట్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:22 AM

తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ పీపుల్స్‌ బడ్జెట్‌ అని, ఇది పూర్తిగా ప్రజల బతుకులు బాగు చేసేందుకే పెట్టామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానిది పీపుల్స్‌ బడ్జెట్‌

  • దేశానికే ఆదర్శంగా ఇందిరమ్మ జీవిత బీమా: భట్టి

ఖమ్మం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ పీపుల్స్‌ బడ్జెట్‌ అని, ఇది పూర్తిగా ప్రజల బతుకులు బాగు చేసేందుకే పెట్టామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. కోటి 15లక్షల మందికి రూ.5లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తెస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా సామూహికంగా కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయలేదని, దేశానికే ఈ పథకం మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుబానికి రూ.5లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:22 AM