Share News

దక్షిణాదిలో రాష్ట్రంలోనే రైతు రుణ భారం తక్కువ

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:37 AM

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే రైతుల రుణ భారం తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు....

దక్షిణాదిలో రాష్ట్రంలోనే రైతు రుణ భారం తక్కువ

  • రైతులందరిపై ఉన్న అప్పుల భారం రూ.1,75,960 కోట్లు

  • పంట రుణాలు రూ.95,167.98 కోట్లు

  • టర్మ్‌ రుణాలు రూ.80,792.58 కోట్లు

  • రుణ మాఫీ వల్లే తగ్గిన భారం.. వెల్లడించిన సీఎంవో

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే రైతుల రుణ భారం తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైతులకు ఉన్న రుణ భారం చాలా తక్కువని వివరించింది. వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. దానిప్రకారం 2025 సంవత్సరం డిసెంబరు 31 నాటికి తెలంగాణలో రైతులకు ఉన్న మొత్తం అప్పులు రూ.1,75,960.56 కోట్లు అని మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో పంట రుణా లు రూ.95,167.98 కోట్లు, టర్మ్‌ రుణాలు రూ.80,792.58 కోట్లు అని వివరించింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 2024లో రూ.21 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేయడంతో రైతులపై రుణభారం తగ్గిందని సీఎంవో వివరించింది.

Updated Date - Mar 11 , 2026 | 04:37 AM