తెలంగాణ మార్కెట్‌కు అంతర్జాతీయ వేదికగా ‘ఈ2ఈ’
ABN , Publish Date - May 02 , 2026 | 05:04 AM
తెలంగాణ మార్కెట్‌కు అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే ఒక సమగ్ర వేదికగా .‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ (ఈ2ఈ)’ మారనుందని ఐటీ...
2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, మే1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మార్కెట్‌కు అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే ఒక సమగ్ర వేదికగా .‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ (ఈ2ఈ)’ మారనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ అంతర్జాతీయ వేదిక లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి కనీసం 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయని.. వ్యాపారులు, ఎగుమతిదారులు, నిపుణులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.