హైదరాబాద్‌లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:35 AM
తెలంగాణ-దక్షిణ కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంత్రి జూపల్లితో కొరియా ప్రతినిధి బృందం భేటీ
తెలంగాణ-దక్షిణ కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ-కొరియన్ కల్చరల్ సెంటర్ (కేసీసీఐ)లు నిర్ణయించాయి. తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు పక్షాలు చర్చించాయి. భారత్‌లోని కొరియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్, కొరియా రాయబార కార్యాలయం కల్చర్ అండ్ ప్రెస్ కౌన్సిలర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి జూపల్లిని సచివాలయంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రతిపాదిత తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం ద్వారా ఇరు ప్రాంతాల కళలు,సంగీతం, నృత్యం, వంటకాలు, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆవిష్కరించే అవకాశం లభిస్తుందన్నారు.