ఉమ్లింగ్ లా పాస్‌ను అధిరోహించిన తాండూరు వాసి
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:24 AM
ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటైన లద్దాఖ్‌లోని ‘ఉమ్లింగ్ లా పాస్’ను వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన యువకుడు అధిరోహించాడు.
తాండూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటైన లద్దాఖ్‌లోని ‘ఉమ్లింగ్ లా పాస్’ను వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన యువకుడు అధిరోహించాడు. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కనుమ వద్ద మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ అందని కఠిన పరిస్థితులు ఉంటాయి. ఈ ఎత్తైన పర్వత శిఖరాన్ని తాండూరు భద్రేశ్వర ఆలయ పూజారి విజయ్‌కుమార్ తనయుడు వినయ్‌కుమార్ ఈ నెల 13న అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సాధించాడు. బుధవారం తాండూరుకు చేరుకున్న వినయ్‌కుమార్‌ను స్థానిక భావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం ప్రతినిధులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు.