వాట్సాప్ మీసేవ ద్వారా.. 3.25 లక్షల మందికి డిజిటల్ సేవలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:11 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సాప్ మీ సేవ విధానం ద్వారా ఇప్పటి వరకు 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు పొందారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సాప్ మీ సేవ విధానం ద్వారా ఇప్పటి వరకు 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు పొందారు. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ మీసేవ ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వం 8096958096 నంబరును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఇప్పటిదాకా 4.5లక్షల మంది వివిధ సేవల కోసం నమోదు చేసుకున్నారు. మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా సేవలను పొందేందుకు ప్రభుత్వం 2025 నవంబరు 18న ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ మీ సేవ ద్వారా 581 రకాల సేవలను వినియోగించుకోవచ్చు. వాట్సాప్ సేవలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా మీసేవ కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. రోజూ 80 వేల మంది వరకు ఈ సేవలను పొందుతున్నారు. 2023 నవంబరు 1 నుంచి 2026 జనవరి 31 వరకు ఈ రెండు సేవల సేవ ద్వారా 5.98కోట్ల లావాదేవీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.3,811 కోట్లు.