చేనేత కార్మికుల పొట్టకొడుతున్న రేవంత్:కవిత
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:25 AM
రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖ చేనేత కార్మికులకు ఇచ్చిన యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేశారని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారి పొట్ట కొట్టడమేనని అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.105 కోట్ల విలువైన యూనిఫాంల ఆర్డర్‌ను రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలకు ఇస్తుంటారన్నారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర విభాగాలకు సంబంధించిన రూ.200కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీ ఆర్డర్‌ను కూడా టెస్కోకు ఇవ్వకపోవడం కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనన్నారు.