Share News

ఎల్‌నినో భయం..!

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:37 AM

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు మాత్రం తెలంగాణలో ఆశాజనకంగానే కొనసాగుతున్నాయి.

ఎల్‌నినో భయం..!

  • వానా కాలంలో రాష్ట్రంలో సగటు వర్షపాతం 38.7 సెం.మీ

  • ఇప్పటిదాకా 37 సెంటీమీటర్ల వర్షపాతం

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు మాత్రం తెలంగాణలో ఆశాజనకంగానే కొనసాగుతున్నాయి. జూన్‌ 1 నుంచి ఆగస్టు 4 వరకు రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 38.7 సెం.మీ. నమోదవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 37.3సెం.మీ. నమోదైనట్టు గణాంకాలు చెబుతు్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం కేవలం 4శాతం లోటుతో సాధారణ స్థాయిలోనే ఉంది. ఒక్క హైదరాబాద్‌ పరిధిలో 9 శాతం లోటు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌ ఆరంభం, జూలై మొదటి వారంలో కొంత నిరాశ పరిచినా.. జూలై రెండో భాగంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. దీంతో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ఆగస్టులోనూ అదే జోరు కొనసాగుతుందని ప్రైవేటు వాతావరణ నిపుణుడు బాలాజీ వెల్లడించారు. మరోపక్క, రుతుపవనాలు అనుకూలంగా ఉన్నంత మాత్రాన 2025 మాదిరిగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆశించలేమని వాతావరణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:39 AM