నేడు భారీ వర్షాలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:24 AM
తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయిదు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ నెల 28 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, 24 జిల్లాలో లోటువర్షపాతమే నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నందిగాంలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.