Share News

ఆమె వయసు 100.. అతడి వయసు 99

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:08 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు.

ఆమె వయసు 100.. అతడి వయసు 99

  • భద్రాద్రి జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులు

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ డివిజన్‌లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సోనియానగర్‌కు చెందిన మాలోత్‌ అరుణ 1992లో జన్మించగా.. ఆమె ప్రస్తుత వయసు 34 సంవత్సరాలు. కానీ ముసాయిదాలో మాత్రం 100 ఏళ్లుగా నమోదు చేశారు. ఇదే కాలనీకి చెందిన మాలోత్‌ రమేష్‌ 1991లో జన్మించగా ఆయన వయసు 35 ఏళ్లు. కానీ 99గా నమోదు చేశారు. వీరిద్దరూ పోలింగ్‌ స్టేషన్‌ నం. 45 శేఖరం బంజర యూపీఎస్సీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ విషయం గురువారం వెలుగులోకి రావడంతో ఓటర్లు ముసాయిదా జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ జాబితాలో పేరు, చిరునామా, వయస్సు లాంటి వివరాలను సవరించుకోవడానికి ఫారం-8ను ఉపయోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 06:10 AM