Share News

ఈనెల 18 నుంచి వీఓఏల నిరవధిక సమ్మె

ABN , Publish Date - May 05 , 2026 | 04:09 AM

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం), సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు..

ఈనెల 18 నుంచి వీఓఏల నిరవధిక సమ్మె

  • సెర్ప్‌ సీఈఓకు నోటీసు ఇచ్చిన వీఓఏల జేఏసీ

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం), సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరవధిక సమ్మె చేపట్టాలని ‘తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్‌ వీఓఏల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ’ నిర్ణయించింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు ఎం. చంద్రశేఖర్‌, ఎన్‌. ప్రభాకర్‌, శరత్‌కుమార్‌, పవన్‌ తదితరులు సోమవారం సెర్ప్‌ సీఈఓ కార్యాలయంలో సమ్మె నోటీసును అందజేశారు. వీఓఏలకు నెలకు రూ. 20,000 కనీస వేతనం చెల్లించాలని, తమను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్‌ పాలసీని వర్తింపజేయాలని, రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 05 , 2026 | 04:09 AM