ఇకపై ఎన్ని వాహనాలు కొన్నా 2 శాతం అదనపు ట్యాక్స్ ఉండదు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:24 AM
ఇకపై రెండు, అంతకంటే ఎక్కువ వాహనాలు ఒకే వ్యక్తి కొనుగోలు చేసినా 2 శాతం అదనపు పన్ను ఉండదని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
వాహన్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇకపై రెండు, అంతకంటే ఎక్కువ వాహనాలు ఒకే వ్యక్తి కొనుగోలు చేసినా 2 శాతం అదనపు పన్ను ఉండదని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్ని వాహనాలు కొనుగోలు చేసినా అదనపు పన్ను ఉండదని స్పష్టం చేశారు. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ భవనంలో వాహన్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పరివాహన్ పోర్టల్‌లో చేరడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమన్నారు. 2016లో వాహన్ అందుబాటులోకి రాగా తెలంగాణ ఇప్పుడు చేరిందన్నారు. వాహన్‌తో అన్ని వివరాలు కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా బేస్‌లోకి వెళ్తాయని, దీంతో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయని చెప్పారు. ఆర్టీసీ విలీనం, సంఘాల గుర్తింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.