Share News

వనమహోత్సవం లక్ష్యం 16 కోట్ల మొక్కలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:22 AM

వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో....

వనమహోత్సవం లక్ష్యం 16 కోట్ల మొక్కలు

  • సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో 4.50 కోట్ల మొక్కలు నాటనున్నారు. అటవీ శాఖ 89.59 లక్షల మొక్కల పెంపకం చేపట్టనుంది. వర్షాకాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు, రహదారుల వెంట విస్తృత స్థాయిలో నాటేందుకు కార్యాచరణ రూపొందించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో సీఎం రేవంత్‌ రెడ్డి చేతులమీదుగా వనమహోత్సవాన్ని ప్రారంభించేందుకు అటవీ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీ్‌సతో కలిసి గుర్రంగూడ పార్క్‌ ప్రాంతాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు.

Updated Date - Jun 05 , 2026 | 04:22 AM